Palakonda: పాలకొండలో అంతర్ జిల్లాల కరాటే పోటీలు ముగింపు.. అభినందనలు

Palakonda: పాలకొండలో అంతర్ జిల్లాల కరాటే పోటీలు ఘనంగా ముగింపు; జాతీయ క్రీడలకు ఎంపికైన క్రీడాకారులకు డీఈఓ బ్రహ్మాజీ, అతిథుల అభినందనలు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 23 Nov 2026 9:24 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో అంతర్ జిల్లాల కరాటే పోటీలు ముగింపు.. అభినందనలు

పాలకొండ: అంతర్ జిల్లాల కరాటి పోటీలు ఘనంగా ముగిసాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీ అధ్యక్షతన జరిగాయి.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ సి.ఎల్ నాయుడు విద్యాసంస్థల అధినేత, ఉప విద్యాశాఖ అధికారి పర్రికృష్ణ మూర్తి, హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన క్రీడాకారులుగా అందరూ మెలిగారని వచ్చిన కోచ్ మేనేజర్లు చాలా చక్కగా పర్యవేక్షణ చేసి రాష్ట్రస్థాయి సెలక్షన్లను పూర్తి చేశారని, ఈ సందర్భంగా జాతీయ క్రీడలకు ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ సోంబాబు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు మజ్జి రామకృష్ణ స్కూల్ గేమ్ సెక్రటరీలు ఆర్ రాములు, దుర్గాదేవిలు, డీఈవో ఆఫీస్ నుండి రంగాచారి, శంకర్రావు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నుండి నెల్లి వెంకటరమణ, పుష్ప నాదం ఉమామహేశ్వరరావు ఎస్వి రమణ, సురేష్, రాము, రమణ ఈశ్వరరావు హైమ చిన్నమ్మడు నిరీక్షణ, శ్రీదేవి తదితరులు పాల్గొని విజయవంతం చేసిరి.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA