Palakonda: పాలకొండలో కొలువుదీరిన గోపాలకృష్ణుడు వైభవంగా శ్రీకృష్ణాష్టమి!

Palakonda: పాలకొండలో త్రైత సిద్ధాంతం, ప్రబోధ సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభం. 6 రోజుల పాటు ప్రత్యేక పూజలు, భగవద్గీత ప్రవచనాలు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 5 Sept 2026 8:51 AM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో కొలువుదీరిన గోపాలకృష్ణుడు వైభవంగా శ్రీకృష్ణాష్టమి!

Palakonda: ఇందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో... త్రైతసిద్ధాంతం వారి ఆధ్వర్యంలో.. మన పాలకొండ పట్టణంలో ప్రబోధ సేవాసమితి, శ్రీకాకుళం శాఖ వారు నిర్వహిస్తున్న "శ్రీకృష్ణ జన్మాష్టమి" వేడుకలు , అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగింది.

ముందుగా ఉదయం 10 గంటలకు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని ప్రతిమను మండపంలో కొలువు తీర్చారు. తధనంతరం గురుపూజ, అష్టోత్తర పూజ, నిర్వహించిన తర్వాత, భగవద్గీత జ్ఞాన ప్రవచనాలు వినిపించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మన పాలకొండ టౌన్ లో గత మూడు సంవత్సరాలుగా వేడుకలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈసారి కూడా ఆరు రోజులు వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.

అందులో భాగంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు ఉంటాయని, భగవద్గీత ఉపన్యాసం నిర్వహిస్తామని, అలాగే చివరి రోజు అయిన తే09-09-2026ది బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ వేడుకలకు కమిటీవారితో పాటు పాలకొండ పట్టణ పెద్దలు మరియు ప్రజలు సహకారంతో నిర్వహణ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు పొట్నూరు సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈ త్రైత సిద్ధాంతం అనేది భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తియోగము అనే అధ్యాయంలో 16 17 శ్లోకాలలో ఉన్నదని , త్రైతము అంటే మూడు ఆత్మల వివరమని ప్రతి జీవరాశి శరీరంలో మూడు ఆత్మలు కలవని అవే జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు అని వివరించారు.

ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత పఠనం దినచర్యలో భాగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఈశ్వర్ లాల్, గిరిబాబు, సుధాకర్, సూర్యనారాయణ, రాంబాబు, వాసుదేవరావు, గోపాలకృష్ణ, అప్పన్న, వెంకట్రావు, రామకృష్ణ, సురేష్, తదితరులుతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story