Palakonda: పాలకొండ ఎమ్మెల్యేను కలిసిన విద్యుత్ ఉద్యోగ సంఘం నేతలు!
Palakonda: 1999-2004 మధ్య నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతూ పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు 1104 యూనియన్ నేతలు వినతిపత్రం అందజేశారు.
Palakonda: పాలకొండ ఎమ్మెల్యేను కలిసిన విద్యుత్ ఉద్యోగ సంఘం నేతలు!
Palakonda: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 1999–2004 మధ్య కాలంలో నియమితులైన విద్యుత్ సంస్థ ఉద్యోగులకు పాత GPF పింఛన్ విధానం అమలు చేయాలనే రాష్ట్ర 1104 యూనియన్ పిలుపులో భాగంగా పాలకొండ శాసనసభ్యులు గౌ!శ్రీ నిమ్మక జయకృష్ణ గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా గౌ.MLA ఈ న్యాయమైన సమస్యకు సంబంధించిన ఈ వినతిపత్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మరియు గౌరవ ఉపముఖ్యమంత్రి గారి దృష్టికి స్వయంగా తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారు పార్వతీపురం మన్యం రీజనల్ అధ్యక్షులు బి జీవరత్నం పాలకొండ డివిజన్ అధ్యక్షులు టి అచ్చం నాయుడు పాలకొండ డివిజన్ కార్యదర్శి ఐ.తౌడు డివిజన్ కోశాధికారి బిహెచ్ తిరుపతిరావు టి సింహాచలం గోర్ రమేష్ je వారాడ చిన్నమనాయుడు VV రమణ ఎం భాస్కరరావు జే వెంకట్రావు వసంత మొదలగునాయకులు పాల్గొన్నారు.




