Palakonda: పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ దసరా ఉత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ!
Palakonda: పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి వేడుకల గోడపత్రికను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆవిష్కరించారు. వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని వెల్లడి.
Palakonda: పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ దసరా ఉత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ!
Palakonda: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి వేడుకల గోడపత్రికను ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సీనియర్ నాయకులు పల్లా కొండలరావు,గంటా సంతోష్, కొండదడి రాజేష్ ఆలయ ఈఓ సూర్యనారాయణతో కలిసి ఆవిష్కరించారు. పాలకొండ అతిపెద్ద వేడుక అయిన అమ్మవారి దసరా నవరాత్రులను అత్యంత వైభవోపేతంగా భక్తి శ్రద్దలతో ప్రతి ఏడాది నిర్వహించడం అనవాయితీగా వస్తుందని ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా నిర్వహించనున్నామని ఎమ్మెల్యే జయకృష్ణ తెలిపారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందేవిధంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేందుకు ప్రణాళికలు రూపొందించామని సీనియర్ నాయకులు పల్లా కొండలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు , బలివాడ శ్రీధర్, బోగాది వెంకటరమణ, పడాల రాంబాబు, కోరికాన గంగునాయుడు దుప్పాడ రమణ దావాల రమణారావు మరియు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.




