Palakonda: కోటదుర్గమ్మ దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే
Palakonda: పాలకొండ ఇలవేల్పు కోటదుర్గమ్మ దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆదేశించారు.
Palakonda: కోటదుర్గమ్మ దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే
Palakonda: పాలకొండ ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న దసరా ఉత్సవాల నిర్వహణపై ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఉత్సవాల నిర్వహణకు పల్లా కొండలరావు (కొండబాబు) ఆధ్వర్యంలో త్వరగా కమిటీని ఏర్పాటు చేయాలని ఆలయ ఈ.వో వి.వి.సూర్యనారాయణను ఎమ్మెల్యే ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. పోలీసు, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు గతం కంటే మెరుగ్గా సేవలందించాలని సూచించారు.
ఉత్సవాల సమయంలో ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు
జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
పాలకొండ డి.ఎస్.పి. ఎం.రాంబాబు మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు పోలీసుశాఖ పూర్తి సహకారం అందిస్తుందని, ఉత్సవాలు పూర్తయ్యే వరకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతామన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాదశర్మ, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసశర్మ మరియు పాలకొండ గ్రామ పెద్దలు ప్రింట్ /ఎలక్ట్రానిక్ మీడియా పాల్గొన్నారు.




