Palakonda: పాలకొండలో మున్సిపల్ కార్మికుల నిరసన.. ప్రైవేటీకరణను రద్దు చేయాలి!

Palakonda: పాలకొండ నగర పంచాయతీలో 14 విభాగాల ప్రైవేటీకరణను నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 22 Jun 2026 9:17 AM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో మున్సిపల్ కార్మికుల నిరసన.. ప్రైవేటీకరణను రద్దు చేయాలి!

Palakonda: పాలకొండ నగర పంచాయతీ కమిటీ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు మరియు ప్రజలకు నష్టదాయకమైన 14 కీలక విభాగాల ప్రైవేటీకరణ విధానం ఉపసంహరణ, ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 975, 673, రద్దు చేయాలని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు శాశ్వత స్వభావం కలిగిన విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి జూన్ 22వ తేదీన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ గారు దగ్గరకు పాదయాత్ర ద్వారా రాయబార కార్యక్రమం జరగనున్నందున పాలకొండ మున్సిపల్ సిబ్బంది.

అందరూ పాల్గొంటారని తెలియజేస్తూ పాలకొండ నగర్ పంచాయతీ కమిషనర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ పాలకొండ కమిటీ గౌరవ అధ్యక్షులు దావాల రమణారావు ప్రధాన కార్యదర్శి సిహెచ్ సంజీవి కోశాధికారి పి వేణు కమిటీ సభ్యులు సిహెచ్ రఘు విమల తదితరులు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story