Palakonda: పాలకొండలో మున్సిపల్ కార్మికుల పని బంద్.. నిరసన విజయవంతం

Palakonda: పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికులు వేతన బకాయిల కోసం నిరసన చేపట్టారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 21 April 2026 5:13 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో మున్సిపల్ కార్మికుల పని బంద్.. నిరసన విజయవంతం

Palakonda: పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ పారిశుద్ధ్య విభాగం కార్మికులు పని బంద్ చేసి నిరసన. తెలియజేసి పాలకొండ ఎస్సై గారు సమక్షంలో కమిషనర్ గారికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేయడం జరిగింది.

పది రోజుల్లోపు ఇంజనీరింగ్ కార్మికుల, నాలుగు నెలలు వేతన బకాయిలు పారిశుద్ధ్య కార్మికుల మూడు నెలలు వేతన బకాయిలు చెల్లిస్తామని వ్రాతపూర్వ హామీ ఇవ్వడంతో ఆందోళన కార్యక్రమం విరమించారు దీనికి ముందు జరిగిన నిరసన కార్యక్రమం ఉద్దేశించి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు),

పాలకొండ కమిటీ గౌరవ అధ్యక్షులు దావాలా రమణారావు మాట్లాడుతూ అక్టోబర్ నెల నుంచి అనేక పర్యాయాలు కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ జీతాలు చెల్లించకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు . చనిపోయిన మరియు రిటైర్మెంట్ అయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని.

కరోనా సమయంలో పనిచేసిన కార్మికులకు ఉపాధి కల్పించాలని, పాలకొండ పట్టణ జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ కార్మికుల సంఖ్య పెంచాలని. పనిముట్లు సరఫరా చేయాలని. పాలకొండ నగర పంచాయతీ సంపూర్ణ పారిశుధ్య నివారణకు తగు చర్యలు చేపట్టాలని, 60 సంవత్సరాలు రిటైర్మెంట్ను 62లకు పెంచాలి.

మట్టి ఖర్చులు 25000 చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించాలి. కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి. తదితరు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కాద రాము యూనియన్ నాయకులు వై హరిబాబు, సిహెచ్ సంజీవి, సిహెచ్ సురేష్, పి వేణు తదితరులు తోపాటు ఇంజనీరింగ్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story