Palakonda: పాలకొండలో సబ్ కలెక్టర్ రివ్యూ.. సీజనల్ వ్యాధులపై అలర్ట్!
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
Palakonda: పాలకొండలో సబ్ కలెక్టర్ రివ్యూ.. సీజనల్ వ్యాధులపై అలర్ట్!
Palakonda: పాలకొండ నగర పంచాయితీ పరిధిలో 9 సచివాలయాల అడ్మిన్సెక్రటరీలు, నగర పంచాయితీ అన్నివిభాగాల సెక్షన్ హెడ్స్ తో పాలకొండ సబ్ కలెక్టర్ మరియు పాలకొండ నగర పంచాయితీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ పవార్ స్వప్నిల్ వారు నగర పంచాయితీ కార్యాలయములోరివ్యూ నిర్వహించారు.
రివ్యూలో భాగంగా ప్రస్తుతం నగర పంచాయితీ లో చేస్తున్న వర్కుల వివరాలు, వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్,శానిటేషన్ విషయాలపై ప్రెజెంట్ స్టేటస్ వివరాలను అడిగి తగిన సలహాలు సూచనలు చేసారు. రానున్నవర్షాకాలంలో సీజనల్ వ్యాదులు రాకుండా ముందస్తు చర్యలు గూర్చి మరియు స్ప్రేయింగ్, ఫాగింగ్మొదలగు మిషన్ల వివరాలు,
పనితీరు అడిగి తెలుసుకున్నారు, వాటిని పట్టణములో వినియోగించిసీజనల్ వ్యాదులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ రివ్యూలో కమీషనర్ శ్రీపి.వి.నూకరాజు గారు పట్టణములో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు,వాటర్ సప్లై, వీధిదీపముల నిర్వహణ, ప్రోపర్టీ ట్యాక్స్ కలెక్షన్ మొదలగువిషయాల గూర్చి వివరించారు.
అనంతరం కమీషనర్ వారు పాటిస్తూ క్రొత్తగా ప్రవేశపెట్టినప్లాస్టిక్ బాటిల్స్ లో ప్లాస్టిక్ కవర్లు (Eco- Bricks) అనే కాన్సెప్ట్ గూర్చి వివరించిప్రస్తుతం నగర పంచయితీ సిబ్బంది పాటిస్తున్న విషయము వివరించారు. పాలకొండ పట్టణంలో ప్లాస్టిక్కవర్లు బయట పారేయకుండా బాటిల్స్ లో వేసి బ్రిక్స్ గా వినియోగించడం గూర్చి వివరించారు.
శ్రీ పవార్ స్వప్నిల్ వారుఇది చాలా మంచి కాన్సెఫ్ట్ అని, పట్టణంలో వర్తకులు, ప్రజలతో చేపట్టాలని సూచించారు. కార్యక్రమములో మేనేజర్, టి.పి.ఏ,సిబ్బంది మరియు సెక్రటరీలు పాల్గొన్నారు.




