Palakonda: పాలకొండలో పరిషత్ కౌంటింగ్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు

Palakonda: పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పోలీసు శాఖ వాహనాల మళ్లింపు, పార్కింగ్ సూచనలు జారీ చేసింది.

KAILASH SAHU, PALAKONDA
Published on: 6 Nov 2026 9:05 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో పరిషత్ కౌంటింగ్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు

పాలకొండ: పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న MPTC / ZPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ మరియు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు మరియు వాహనాల మళ్లింపు చర్యలు చేపడుతోంది.

ఈ నేపథ్యంలో ప్రజలకు, ఎన్నికల ఏజెంట్లకు మరియు విధుల్లో పాల్గొనే అధికారులకు సూచనలు:

1. కౌంటింగ్ ఏజెంట్లకు మార్గం:

- కౌంటింగ్ ఏజెంట్లు వడమ జంక్షన్ (Vadama Junction) వైపు నుంచి మాత్రమే కేటాయించిన మార్గంలో కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలి. ద్విచక్ర వాహనాలు కోసం పార్కింగ్ స్థలం రవీంద్ర భారతి స్కూల్ ప్రక్క ఇవ్వడం జరిగింది , ఇతర వాహనాలు ఏవీ కూడా వైపు అనుమతించ బడదు.

- పోలీసు సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలి.

2. కౌంటింగ్ అధికారులకు మార్గం:

- కౌంటింగ్ విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎం.ఎం. నగర్ (MM Nagar) వైపు నుంచి తమ్మి నాయుడు కళాశాల జంక్షన్ (Tammi Naidu Junction) మీదుగా కేటాయించిన మార్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకోవాలి.

- విధులకు సంబంధించిన గుర్తింపు కార్డులను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.

3. సాధారణ ప్రజలకు సూచనలు:

- కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో అనుమతి లేని వాహనాల రాకపోకలను నియంత్రించడం జరుగుతుంది.

- కౌంటింగ్ కేంద్రం వద్ద గుంపులుగా గుమిగూడరాదు.

- అనవసరంగా కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాలకు రావద్దు.

- ట్రాఫిక్ మళ్లింపులకు సహకరించి పోలీసుల సూచనలను పాటించాలి.

- శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడరాదు.

ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా మరియు సజావుగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లు మరియు వాహనదారులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరడమైనది.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA