Palakonda: జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తూ వినతిపత్రం

Palakonda: నంద్యాలలో జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ పాలకొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 8 Sept 2026 10:29 PM IST
Palakonda
X

Palakonda: జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తూ వినతిపత్రం

పాలకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల ఐ న్యూస్ రిపోర్టర్లు సురేష్, నాగచంద్రుడులను ఒక ప్రముఖ వ్యక్తిపై వార్త ప్రచురణ చేసిన కారణంగా అర్ధరాత్రి పూట ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడాన్ని జర్నలిస్ట్ సమాజం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము.

భారత రాజ్యాంగంలో మహనీయుడు అంబేద్కర్ గారు కల్పించిన సెక్షన్ 19-1(ఏ) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు ఇటువంటి చర్యలు విఘాతం కలుగజేస్తున్నాయని మీ ద్వారా ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకుంటున్నాము. ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి అనునిత్యం ఒక కాపలాదారులా పనిచేసే జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ లను ఇకనైనా ఆపి మా స్వేచ్ఛను కాపాడాలని కోరుకుంటున్నాము.

ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కోసం నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకన్ చెప్పిన మాటకు కట్టుబడి మేము రాస్తున్న వార్తలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిపై వివరణ కోరడమో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పిర్యాదు చేయడమో తప్ప అరెస్టులు సరైన మార్గం కాదని మీద్వారా వ్యవస్థలకు విన్నవించుకుంటూ అరెస్ట్ కాబడిన జర్నలిస్టులను విడుదల చేయాలని కోరుతూ తాసిల్దార్ కార్యాలయ అధికారికి వినతిపత్రం పాలకొండ ప్రెస్ క్లబ్ తరఫున ప్రింట్ /ఎలక్ట్రానిక్ మీడియా అందజేశారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story