Palakonda: స్మగ్లర్ల ఆగడాలకు జర్నలిస్టు బలి.. తహశీల్దార్‌కు వినతిపత్రం
Palakonda: చిత్తూరు జిల్లా వి.కోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ పాలకొండ జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు.
Palakonda: స్మగ్లర్ల ఆగడాలకు జర్నలిస్టు బలి.. తహశీల్దార్‌కు వినతిపత్రం
Palakonda: చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ పాలకొండ జర్నలిస్టులు నిరసన తెలిపారు. అనంతరం తాసిల్దార్ తాసిల్దార్ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా, వి. కోట మండలం 'ఆంధ్రజ్యోతి' రిపోర్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎర్రచందనం స్మగ్లర్లు అతి కిరాతకంగా హత్య చేసిన ఘటనను పాలకొండ ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్రంగా ఖండించారు.
సమాజంలో జరుగుతున్న అక్రమాలను, ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి సామాజిక విద్రోహ చర్యలను ధైర్యంగా వార్తా కథనాల ద్వారా ప్రజల ముందుకు తెచ్చినందుకు గాను, ఆయనపై ఈ ఘాతుకానికి పాల్పడటం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా భావిస్తున్నట్టు తెలిపారు.
నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు రక్షణ కరువైందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ నేపథ్యంలో పాలకొండ ప్రెస్ క్లబ్ తరపున జర్నలిస్టులందరు కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.




