Palakonda: విద్యార్థులే టార్గెట్.. పాలకొండలో శక్తి టీం స్పెషల్ డ్రైవ్!
Palakonda: పాలకొండ, భామిని స్కూళ్లలో విద్యార్థులకు శక్తి టీం ఇంచార్జ్ ఝాన్సీ భాయి కీలక అవగాహన. సైబర్ నేరాలు, డ్రగ్స్ మహమ్మారి, పోక్సో యాక్ట్‌లపై చైతన్యం.
Palakonda: విద్యార్థులే టార్గెట్.. పాలకొండలో శక్తి టీం స్పెషల్ డ్రైవ్!
పాలకొండ: శక్తి టీం , పాలకొండ టౌన్ లో జడ్పీహెచ్ పాఠశాల హట్కో కాలనీలో మరియు భామిని మండలం బత్తిరి గ్రామంలోని ఎంపీపీ స్కూల్లో, బాల బాలికలకు అవగాహన సదస్సు ను ఏర్పాటు చేసి, వారికి సైబర్ నేరగాళ్లు,నేరాలు గురించి అపరిచిత వ్యక్తులు నుండి కాల్ కానీ, మెసేజ్ వచ్చిన వాటికి రెస్పాండ్ అవ్వకూడదు అని మరియు ప్రస్తుత సమాజం లో మాదకద్రవ్యాలు ప్రభావం ఎక్కువగా ఉన్నాయి.
అని వాటిపట్ల అవగాహన చేసుకొని ఎవరైనా మాదకద్రవ్యాలు బానిస అయినట్లు తెలిసిన సమాచారం మాకు తెలియచేస్తే, వారికి మన్పించడానికి పార్వతీపురం లో De- Addiction ఉంది అని తెలియచేసి, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసిన శక్తి యాప్ డౌన్లోడ్ అండ్ రిజిస్ట్రేషన్ మరియు శక్తి యాప్ అందులో ఉండే 11 ఫ్యూచర్స్ యూజెస్ మరియు శక్తి యాప్ టోల్ ఫ్రీ నెంబర్ 112, మహిళలు రక్షణ చట్టం,పోక్సో యాక్ట్, సైబర్ క్రైమ్ 1930, డ్రగ్స్ 1972, EAGLE మరియు బాల్య వివాహం, మొబైల్ ఫోన్ యొక్క నష్టాలు లాభాలు.
మొదలైన వాటి గురించి అవగాహన సదస్సు నిర్వహిస్తూ, ప్రతి ఒక్క విద్యార్థిని తన యొక్క మొబైల్ ఫోన్లో శక్తి యాప్ రిజిస్ట్రేషన్ చేసుకుని అందులో ఉండే 11 ఫ్యూచర్స్ పై అవగాహన చేసుకుని ఆపద సమయంలో శక్తి యాప్ ఎలా వినియోగించుకోవాలో శక్తి టీం ఇంచార్జ్ ఝాన్సీ భాయి చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిహెచ్ ప్రకృతాంబ, రాము చంద్రశేఖర్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.




