Palakonda: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల భారీ అవగాహన ర్యాలీ

Palakonda: పాలకొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై నినాదాలతో భారీ ర్యాలీ, ప్రతిజ్ఞ. పాల్గొన్న ప్రిన్సిపాల్, ఎన్ఎస్‌ఎస్ అధికారులు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 4 Aug 2026 2:24 PM IST
Palakonda
X

Palakonda: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల భారీ అవగాహన ర్యాలీ

పాలకొండ: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు) విద్యార్థిని, విద్యార్థులు ప్రిన్సిపాల్ పైల శంకర్ రావు ఆధ్వర్యంలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి వెలమల అప్పారావు పర్యవేక్షణలో వర్షపు నీటి చుక్కలు వడిసి పడదాం అని నినాదాలు చేస్తూ పాలకొండ జూనియర్ కళాశాల నుండి యాలం సెంటర్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు.

ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతల తవ్వి వర్షపు నీటిని అందులో నిల్వచేసి భూగర్భ జలాలను అడుగంటి పోకుండా కాపాడుతాం అని ప్రతిజ్ఞ చేస్తూ ర్యాలీ చేపట్టారు... ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ నాయుడు పీజీ శ్రీనివాస్ రవిశంకర్ టైపిస్టు రామకృష్ణ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story