Palakonda: పాలకొండ నగర పంచాయతీలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
Palakonda: పాలకొండ నగర పంచాయతీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవర్. ఆవరణలో రక్తదాన శిబిరం.
Palakonda: పాలకొండ నగర పంచాయతీలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
పాలకొండ: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పాలకొండ నగర పంచాయతీ కార్యాలయంలో ఈరోజు ఉదయం పాలకొండ సబ్ కలెక్టర్ మరియు పాలకొండ నగర పంచాయతీ స్పెషలాఫీసర్ శ్రీ స్వప్నిల్ పవర్ వారు జండా వందనం కావించి స్వాతంత్ర దినోత్సవం గూర్చి మరియు వీరిలో త్యాగాలను మనం పాటించవలసిన కార్యక్రమాలు మొదలైనవి వివరించారు.
కార్యక్రమంలో కమిషనర్ శ్రీ పివి నూకరాజు మరియు నగర పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
తదనంతరం 9 గంటలకు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పాలకొండ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యాలయం వద్ద నిర్వహించబడినది. కార్యక్రమంలో సూపరిండెంట్ చిరంజీవి డాక్టర్ గారు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివప్రకాష్ గారు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




