Palakonda: పాలకొండ సబ్ కలెక్టరు సీరియస్.. పోలీసు అధికారులకు కీలక వార్నింగ్!

Palakonda: పాలకొండ డివిజన్ శాంతి భద్రతలపై సబ్ కలెక్టరు స్వప్నిల్ పవార్ సమీక్ష.

KAILASH SAHU, PALAKONDA
Published on: 8 May 2026 10:25 AM IST
Palakonda
X

Palakonda: పాలకొండ సబ్ కలెక్టరు సీరియస్.. పోలీసు అధికారులకు కీలక వార్నింగ్!

Palakonda: పాలకొండ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిస్థితులపై పాలకొండ సబ్ కలెక్టరు శ్రీ స్వప్నిల్ పవార్ గారు పోలీసు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం పాలకొండ సబ్ కలెక్టరు వారి కార్యాలయంలో జరిగింది. సమావేశానికి DSP, పాలకొండ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, వివిధ పోలీస్ స్టేషన్ల SHOలు మరియు ఇతర పోలీసు శాఖ అధికారులు హాజరయ్యారు. డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేయాలని సబ్ కలెక్టరు గారు సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసు శాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story