Palakonda: వెంకటరాయని కోనేరు సుందరీకరణ పనులకు రేపే శంకుస్థాపన

Palakonda: పాలకొండ వెంకటరాయని కోనేరు సుందరీకరణకు రూ. 1.95 కోట్ల సుడా నిధులతో బుధవారం శంకుస్థాపన చేయనున్న సుడా చైర్మన్ కోరికాన రవికుమార్. అధికారుల పరిశీలన.

KAILASH SAHU, PALAKONDA
Published on: 24 Aug 2026 4:20 PM IST
Palakonda
X

Palakonda: వెంకటరాయని కోనేరు సుందరీకరణ పనులకు రేపే శంకుస్థాపన

పాలకొండ: వెంకటరాయని కోనేరుకు మహర్థశ శతబ్దాల చరిత్ర కలిగిన కోనేరుకు సుందరీకరణతో కొత్త రూపు ఒక కోటి 95 లక్షల సుడా నిధులతో తొలిదశ సుందరీకరణకు బుధవారం శంకుస్థాపన. తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమానికి స్వయంగా హాజరు కానున్న సుడా చైర్మన్ కోరికాన రవికుమార్.

శతబ్దాల చరిత్రకలిగిన పాలకొండ వెంకటరాయని కోనేరు సుందరీకరణకు ముహూర్తం ఖరారైంది. గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడిన సుడా చైర్మన్ కోరికాన రవికుమార్ శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అదారిటీ నిధులనుండి 1.95 కోట్ల పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు.

ఈ క్రమంలో నేడు సుడా DE జగదీష్, AE మల్లేష్ పరిశీలించారు. తొలివిడతగా ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధి ప్రాంతాన్ని డెవలప్ చేయనున్నామని, ఇప్పటికే టెండర్ల ప్రక్రియ చేపట్టామని కడప ప్రాంతానికి చెందిన మునిస్వామి అనే కాంట్రాక్టర్ తక్కువ ధర కొటేషన్ చేసిన తరుణంలో ఆయనకు కాంట్రాక్టు దక్కిందని శరవేగంగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని తెలిపారు. అధికారుల పర్యటనలో మాజీ కౌన్సిలర్ కొరికాన గంగునాయుడు, చౌదరి నాయుడు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story