Palakonda: జూలై 30న కలెక్టరేట్ ముట్టడికి వీఆర్ఏల పిలుపు
Palakonda: వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై 30న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పాలకొండ మండలంలో వీఆర్ఏల సంఘం పిలుపు.
Palakonda: జూలై 30న కలెక్టరేట్ ముట్టడికి వీఆర్ఏల పిలుపు
పాలకొండ: పాలకొండ మండల వీఆర్ఏల కు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. జులై ౩౦ చలో కలెక్టరేట్ కు వీఆర్ఏలంతా కదిలి రావాలని పిలుపు.
రాష్ట్రంలో గ్రామ రెవిన్యూ సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని, దీనికి నిరసనగా ఈనెల 30న జరుగుతున్న కలెక్టర్ ఆఫీసుల ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మరియు సిఐటియు పిలుపునిచ్చింది.
మన్యం జిల్లా పాలకొండ మండలం సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వీఆర్ఏల సంఘం జిల్లా నాయకులు ఎన్ గోపి సిఐటియు మండల కార్యదర్శి కాద రాము మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఏలకు అమలు చేస్తున్న పే స్కేలను ఏపీలో అమలు చేసి చెల్లించాలని, అర్హత ఉన్న వీఆర్ఏలను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వీఆర్వోలుగా ప్రమోషన్ ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా అమలు చేస్తున్న నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, డి ఏ ను జీతములో కలపాలని, వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న అటెండర్ వాచ్మెన్ రికార్డ్ అసిస్టెంట్ మరియు విఆర్ఓ పోస్టులను బత్తిలో 70% వీఆర్ఏలకు కేటాయించాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
పై సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న కార్యక్రమంలో వీఆర్ఏలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏ నాయకులు, బి మాధవరావు, ఎం శ్రీనివాసరావు, జి ప్రసన్న కుమార్, జి జయమ్మ ఈ మంగమ్మ, జే కామేశ్వరి ,చిన్నారావు వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.




