Palakonda: పాలకొండలో వైఎస్సార్‌సీపీ ఓటర్ల ప్రత్యేక సవరణ శిక్షణా కార్యక్రమం
Palakonda: పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఏఎంజీ హాల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం జరిగింది.
Palakonda: పాలకొండలో వైఎస్సార్‌సీపీ ఓటర్ల ప్రత్యేక సవరణ శిక్షణా కార్యక్రమం
Palakonda: పాలకొండ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఏఎంజీ కన్వెన్షన్ హాల్ నందు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ గారి ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు శ్రీ విశ్వాసరాయి కళావతి గారి అధ్యక్షతన 287 మంది బూత్ ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమం మరియు SIR (Special Intensive Revision) ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ శత్రుచర్ల పరీక్షిత్ రాజు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ గారు మాట్లాడుతూ..
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని,అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుండి తొలగిపోకుండా పార్టీ శ్రేణులు గ్రామ స్థాయిలో ఇంటింటికి వెళ్లి పరిశీలన చేయాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజ్ గారు మాట్లాడుతూ బూత్ స్థాయి బలోపేతమే పార్టీ విజయానికి అసలైన బలం అని అన్నారు.
మాజీ శాసనసభ్యులు శ్రీమతి విశ్వాసరాయి కళావతి గారు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి బూత్‌లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని అన్నారు. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన SIR కోఆర్డినేషన్ టీం సభ్యులు గణేష్ గారు, సతీష్ గారు SIR కార్యక్రమం ద్వారా ఓటర్ల వివరాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై నాయకులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా,నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. పాలకొండ నియోజకవర్గంనకు సంబంధించి 287 మంది బిఎల్ఏలు శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితోపాటు నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పిటిసిలు, మండల కన్వీనర్లు, నగర పంచాయతీ మాజీ కౌన్సిలర్లు, అనుబంధ విభాగ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.




