Peddaboddapadu: పెద్దబొడ్డపాడులో ఎమ్మెల్యే గౌతు శిరీష పెన్షన్ల పంపిణీ!

Peddaboddapadu : పలాస నియోజకవర్గం పెద్దబొడ్డపాడు గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష పాల్గొన్నారు.

B LOKANADHAM, PALASA
Published on: 1 July 2026 11:51 AM IST
Peddaboddapadu
X

Peddaboddapadu: పెద్దబొడ్డపాడులో ఎమ్మెల్యే గౌతు శిరీష పెన్షన్ల పంపిణీ!

పెద్దబొడ్డపాడు: పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం పెద్దబొడ్డపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పలాస శాసన సభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని తెలిపారు.

ప్రతి నెలా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన ప్రతి సేవను ఇంటి వద్దకే చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గౌతు శిరీష గారు అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు లబ్ధిదారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

B LOKANADHAM, PALASA

B LOKANADHAM, PALASA

Next Story