Palasa: రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత.. పలాస ఎమ్మెల్యే ప్రకటన

Palasa: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామంలో ఎమ్మెల్యే గౌతు శిరీష రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుబుక్కులను రైతులకు పంపిణీ చేశారు.

B LOKANADHAM, PALASA
Published on: 3 July 2026 7:26 PM IST
Palasa
X

Palasa: రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత.. పలాస ఎమ్మెల్యే ప్రకటన

Palasa: పలాస నియోజకవర్గం పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామంలో నిర్వహించిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమంలో పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారు పాల్గొని అర్హులైన రైతులకు పట్టాదారు పాసుబుక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష గారు మాట్లాడుతూ, రైతుల భూ హక్కులకు మరింత భద్రత కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుబుక్కులను అందజేస్తోందని తెలిపారు. రైతుల భూములకు సంబంధించిన రికార్డులు పారదర్శకంగా, శాశ్వతంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, భూ సమస్యల పరిష్కారం, వ్యవసాయాభివృద్ధి, రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పలాస ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబు రావు గారు ఏం సి చైర్మన్ మల్ల శ్రీనివాస్ గారు మండల అధ్యక్షులు కుత్తుం లక్ష్మణ్ కుమార్ గారు కార్యదర్శి దువ్వాడ సంతోష్ నాయుడు, వంకల కూర్మా రావు గారు హర్ష నాయుడు గారు యాదగిరి గారు మురళి గారు కృష్ణారావు గారు సుధాకర్ గారు బమ్మిడి ఆనందు గారు ప్రభుదాస్ గారు తహసిల్దార్ గారు సంబంధిత రెవెన్యూ అధికారులు, , కూటమి నాయకులు, రైతులు, గ్రామ పెద్దలు, అధికారులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

B LOKANADHAM, PALASA

B LOKANADHAM, PALASA

Next Story