Palakonda: ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌కు రెడ్‌క్రాస్ అరుదైన గౌరవం!
Palakondaవైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పాలకొండలో నిర్వహించిన భారీ రక్తదాన శిబిరానికి గాను ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ను రెడ్‌క్రాస్ సొసైటీ మెడల్
Palakonda: ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌కు రెడ్‌క్రాస్ అరుదైన గౌరవం!
పాలకొండ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా.
పాలకొండలో ఏఎంజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ద్వారా 150 మంది నుంచి రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ సొసైటీకి అందించుటగాను.
ఈ రక్తం అత్యవసర సమయంలో చాలామందికి ఉపయోగపడినందువలన వారి సేవలను గుర్తించి ఈరోజు శ్రీకాకుళంలో రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్ గారిని మెడల్,ప్రశంస పత్రంతో సన్మానించారు.
వారి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి తమకు సహకరించాలని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కోరారు.
Next Story




