Parvathipuram: శిశు గృహ పాప 'ప్రియంవద'కు నూతన జీవితం

Parvathipuram: పార్వతీపురం జిల్లా శిశు గృహలోని 'ప్రియంవద' అనే పాపను తమిళనాడు దంపతులకు జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి అధికారికంగా దత్తత ఇచ్చారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 21 July 2026 11:40 AM IST
Parvathipuram
X

Parvathipuram: శిశు గృహ పాప 'ప్రియంవద'కు నూతన జీవితం

పార్వతీపురం: ​శిశు గృహ పాపకు నూతన జీవితం తమిళనాడు దంపతులకు దత్తత ఇచ్చిన జాయింట్ కలెక్టర్

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జిల్లా శిశు గృహలో పెరుగుతున్న 'ప్రియంవద' అనే పసిపాపకు ఒక సంతోషకరమైన నూతన జీవితం లభించింది. జూలై 20వ తేదీ, సోమవారం నాడు జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి, ఐసిడిఎస్ పిడి కనకదుర్గల చేతుల మీదుగా ఈ పాపను తమిళనాడుకు చెందిన దంపతులకు అధికారికంగా దత్తత ఇచ్చారు.

​చట్టబద్ధమైన అన్ని దత్తత ప్రక్రియలు (CARA నిబంధనల ప్రకారం) పూర్తి చేసిన అనంతరం, సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాపను ఆ దంపతులకు అప్పగించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పెంపకం లేక అనాథగా మిగిలిపోయిన పిల్లలకు దత్తత ద్వారా నూతన జీవితం కల్పించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. పాపను సొంత బిడ్డలా చూసుకుంటూ మంచి భవిష్యత్తును అందించాలని దంపతులకు సూచించారు. ​

ఐసిడిఎస్ పీడీ కనకదుర్గ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకతతో దత్తత ప్రక్రియ నిర్వహించామని, పాప సంక్షేమంపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంరక్షణ అధికారులు, శిశు గృహ నిర్వాహకులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story