Rajapuram: ఓటర్ల జాబితా సవరణపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
Rajapuram: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం టీకే రాజపురంలో జరుగుతున్న సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SAR) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
Rajapuram: ఓటర్ల జాబితా సవరణపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
Rajapuram: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి బుధవారం పాలకొండ మండలం టీకే రాజపురం గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఏఆర్/SIR) కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) నిర్వహిస్తున్న ఇంటింటి ధృవీకరణ, దరఖాస్తుల స్వీకరణ, ఓటరు వివరాల నమోదు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, అనర్హుల పేర్ల తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పులు వంటి ప్రక్రియలను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా నాణ్యతను మెరుగుపరచడంలో బీఎల్‌వోలు కీలక పాత్ర పోషించాలని, ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ నిర్ణీత గడువులోగా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ పర్యటలో పాలకొండ శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ, పాలకొండ ఇంచార్జ్ సబ్ కలెక్టర్ ధర్మరాజు, పాలకొండ తహసీల్దార్ రాధా కృష్ణ, రెవెన్యూ, సచివాలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు.




