Parvathipuram: వరుస దొంగతనాల గుట్టురట్టు.. నలుగురు నిందితుల అరెస్ట్!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఏడు దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు.
Parvathipuram: వరుస దొంగతనాల గుట్టురట్టు.. నలుగురు నిందితుల అరెస్ట్!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా పలు దొంగతనాలు కేసులో ఈరోజు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ మాధవరెడ్డి ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు. సాలూరు నియోజకవర్గం లో ఏడు చోట్ల జరిగిన దొంగతనం కేసుల్లో 4గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీరిలో మైనర్ యువకుడు.
ముద్దాయిల పేర్లు గొల్లపల్లి సాయికుమార్ (23), బత్తుల యుగంధర్,(22), అల్తి గణేష్ (21) మైనర్ యువకుడు. ఏడు కేసుల్లో 90గ్రాముల బంగారం, 30 తులాలు వెండి, 90,000 వేలు నగదు ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.
ముద్దాయి పాచిపెంట మండలం చినచీపురువలస ఏప్రిల్ 11న ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ఫింగర్ ప్రింట్ ఆధారంగా గొల్లపల్లి సాయి కుమార్ నీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఇతర ముద్దాయిలు పేర్లు వెల్లడించినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.
నలుగురుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించిన ఎస్పీ తెలిపారు. ముద్దాయిలు ఇద్దరిపై మానాపురం పోలీస్ స్టేషన్ లో గంజాయి కేసులో పట్టుబడినట్టు ఎస్పీ తెలిపారు.




