Manyam District: మన్యంలో మారిన సాగునీటి ముఖచిత్రం: ‘రాళ్ళగడ్డ’ కాలువల పునరుద్ధరణతో 600 ఎకరాలకు జలకళ!
Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస, వీరఘట్టం మండలాల్లో సాగునీటి కాలువల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. రాళ్ళగడ్డ కెనాల్ ద్వారా సుమారు 600 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి భరోసా లభించనుంది.
Manyam District: మన్యంలో మారిన సాగునీటి ముఖచిత్రం: ‘రాళ్ళగడ్డ’ కాలువల పునరుద్ధరణతో 600 ఎకరాలకు జలకళ!
పార్వతీపురం మన్యం: ఆరుగాలం శ్రమించి లోకానికి అన్నం పెట్టే అన్నదాతల కళ్లలో ఆనందం చూడటమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాగునీటి ఎద్దడితో ఏళ్ల తరబడి అల్లాడుతున్న రైతన్నల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం, యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన సాగునీటి వనరుల పునరుద్ధరణ పనులు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం గెడ సింగపురం,వీరఘట్టం మండలం సంత నర్సిపురం, గ్రామాల పరిధిలో సాగునీటి రంగం కొత్త రూపు సంతరించుకుంది. ప్రభుత్వ చిత్తశుద్ధితో చేపట్టిన పనుల వల్ల ఈ ప్రాంతం ఇప్పుడు పచ్చని పంటలతో కళకళలాడేందుకు సిద్ధంకానుంది.
ప్రభుత్వ కృషితో తొలగిన ఆటంకాలు రాళ్ళగడ్డ సౌత్ కెనాల్ పరిధిలో పేరుకుపోయిన సమస్యలను ప్రభుత్వం సమర్థవంతంగా పరిష్కరిస్తోంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన ఉండ్రు మట్టిని తొలగించే ప్రక్రియను ప్రభుత్వం భారీ ఎత్తున చేపట్టింది. సౌత్ కెనాల్‌తో పాటు సర్ ప్లస్ కెనాల్, చెరువు అడుగు భాగాల్లో అడ్డుగా ఉన్న మొండి మట్టిని తొలగించడం ద్వారా నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ పటాపంచలయ్యాయి. ముఖ్యంగా బోడెడ్రి ట్రెంచ్ వద్ద ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాలను క్లియర్ చేయడం వల్ల కాలువలో నీరు సాఫీగా సాగేందుకు మార్గం సుగమంకానుంది.
పెరగనున్న నిల్వ సామర్థ్యం - పెరగనున్న దిగుబడి
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 598.95 ఎకరాల ఆయకట్టుకు శాశ్వత ప్రాతిపదికన సాగునీటి భరోసా లభించనుంది. చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరగడం వల్ల అటు భూగర్భ జల మట్టం కూడా వృద్ధి చెందుతోంది. దీని ప్రభావం వల్ల బోరు బావుల్లో నీటి లభ్యత పెరిగి, పంటలకు అవసరమైన సమయంలో నీరు అందనుంది. ఫీడర్ కెనాల్ సామర్థ్యం పెరగడంతో చిట్టచివరి పొలానికి కూడా జలకళ చేకూరనుంది.
రైతన్నల కృతజ్ఞతాభివందనం
'జలధార జలహారతి' కార్యక్రమంలో భాగంగా సాగునీటి అవసరాలను గుర్తించి, ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్న ప్రభుత్వ తీరుపై ఎస్. నర్సిపురం, జి. సింగపురం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడులు పెరగడానికి, తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారం మరువలేనిదని వారు కొనిాడుతున్నారు.
ముగిసిన నిరీక్షణ మొదలైన హరిత వైభవం. ఒకప్పుడు నీటి చుక్క కోసం ఆకాశం వైపు దీనంగా చూసిన పొలాలు, నేడు ప్రభుత్వ పునరుద్ధరణ పనుల పుణ్యమా అని జలకళతో ఉట్టిపడుతున్నాయి. వందలాది రైతు కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని నింపుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ఈ ప్రాంత రైతాంగ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది.




