Parvathipuram: హైస్కూల్‌లో పర్యావరణ సంరక్షణ వేడుక.. ఉపాధ్యాయుడి ఉదారత!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం తలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణకు ఉపాధ్యాయుడు కడగల శివప్రసాదరావు శ్రీకారం చుట్టారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 25 Jun 2026 10:19 AM IST
Parvathipuram
X

Parvathipuram: హైస్కూల్‌లో పర్యావరణ సంరక్షణ వేడుక.. ఉపాధ్యాయుడి ఉదారత!

Parvathipuram: మొక్కల పెంపకం ద్వారా భూతాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో తలవరం జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల గణితశాస్త్ర ఉపాధ్యాయుడు కడగల శివప్రసార్రావు మొదటి అడుగు వేశారు. సుమారు 250 మంది విద్యార్థులు, 17 మంది ఉపాధ్యాయులున్న ఆ పాఠశాలలో ఇటీవల పదో తరగతి పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ట్రిపుల్ ఐటీ సాధించిన విద్యార్థులు భరణి, గోవిందరావు, హరిప్రియ, గాయత్రీ, కిరణ్ సాయి,

పవిత్రతో పాటు ఉపాధ్యాయుడు కె. జనార్దనరావు అందజేసిన రూ.14,000 ఆర్ధిక సాయంతోపాటు ఆయన రూ.34,000 సొంత నిధులు వెచ్చించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఎంఈవో ఆర్. ఆనందరావు బుధవారం శ్రీకారం చుట్టారు.కడియం నుంచి తెప్పించి.దీనికోసం కడియం నుంచి 100 మొక్కలు తెప్పించారు. వాటి చుట్టూ రక్షణ కంచెలను ఏర్పాటు చేశారు. పాఠశాల ఆవరణలోని బోరు నుంచి బిందు సేద్యం పైపులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రతి మొక్కకు పూర్తిస్థాయిలో నీరు అందే విధంగా చర్యలు

పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు

తీసుకున్నారు. ఆటస్థలం మట్టి మొక్కలకు అనుకూలంగా లేకపోవడంతో సుమారు రూ. 15 వేలతో పనసనందివాడ నుంచి సారవంతమైన మట్టిని తీసుకొచ్చారు. గుంతల్లో పోసి మొక్కలను నాటారు. చుట్టూ ఎత్తయిన గట్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల నీటి వృథాను అరికట్టవచ్చని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతోపాటు వేగ మొక్కలు వంతంగా పేర్కొంటున్నారు. పెరుగుతాయని

సమష్టి కృషితో పర్యావరణ పరిరక్షణే ప్రధాన ధ్యేయం. ఉపాధ్యాయులు, విద్యార్థుల సమష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నాణ్యమైన విద్యతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిం చాలని కార్యాచరణ ప్రారంభించాం. ప్రతి మొక్కను సంరక్షించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.

ఎస్. రాజ్యలక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story