Pathapatnam: కొరసవాడలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇంటింటి ప్రచారం

Pathapatnam: కొరసవాడలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమ పాలనపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇంటింటి ప్రచారం. ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 28 July 2026 7:30 PM IST
Pathapatnam
X

Pathapatnam: కొరసవాడలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇంటింటి ప్రచారం

పాతపట్నం: పాతపట్నం నియోజకవర్గం, పాతపట్నం మండలం, కొరసవాడ గ్రామ పంచాయతీ 44 బూత్ లో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై ఇంటింటికీ (డోర్ టు డోర్) కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సేవలు మరియు భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాల గురించి ప్రజలకు వివరించారు.ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజలతో నేరుగా మమేకమై అవగాహన కల్పించారు.

అలాగే ప్రజల సమస్యలు,సూచనలు తెలుసుకొని,వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఆశీస్సులు,సహకారంతో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగుతుందని మామిడి గోవిందరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, క్లస్టర్,యూనిట్,బూత్ ఇన్‌చార్జులు, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

Next Story