Pathapatnam: అమర్‌నాథ్ గౌడ్ సజీవ దహనం రాష్ట్ర చరిత్రలోనే మాయని మచ్చ

Pathapatnam: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు (ఎంజీఆర్) మాట్లాడారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 16 Jun 2026 6:31 PM IST
Pathapatnam
X

Pathapatnam: అమర్‌నాథ్ గౌడ్ సజీవ దహనం రాష్ట్ర చరిత్రలోనే మాయని మచ్చ

Pathapatnam: పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు (ఎంజీఆర్) మాట్లాడుతూ, రేపల్లెలో బీసీ (గౌడ) సామాజిక వర్గానికి చెందిన యువకుడు అమర్‌నాథ్ గౌడ్ హత్య ఘటన రాష్ట్ర చరిత్రలో ఒక మాయని మచ్చగా నిలిచిందని అన్నారు.

ఒక యువతి పట్ల జరిగిన వేధింపులను ప్రశ్నించినందుకే అమర్‌నాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం అత్యంత దారుణమని, వైసీపీ పాలనలో మహిళలకు, యువతకు, బీసీ వర్గాలకు భద్రత లేకుండా పోయిందనే విషయాన్ని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రశ్నించే గొంతులను అణచివేసే ధోరణి పెరిగిందని విమర్శించారు.

అమర్‌నాథ్ గౌడ్ చూపించిన ధైర్యం, తెగువ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, అన్యాయాన్ని ఎదిరించిన వ్యక్తిగా ఆయనను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచే అండగా నిలిచిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమర్‌నాథ్ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందించారని గుర్తుచేశారు. బాధితులకు న్యాయం చేయడంలోనూ, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడంలోనూ టీడీపీ చిత్తశుద్ధితో పనిచేసిందన్నారు.

అమర్‌నాథ్ గౌడ్ హత్య కేసును ప్రజలు మరవకుండా, రాష్ట్రంలో జరిగిన అరాచకాలను ప్రజలకు గుర్తు చేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. బీసీ వర్గాలు, యువత, మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లి, భద్రత, న్యాయం, జవాబుదారీతనం కలిగిన పాలనను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల గౌరవం, యువత భద్రత విషయంలో ప్రభుత్వం రాజీపడదని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు, బీసీ సెల్ ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

Next Story