Pathapatnam: పాతపట్నంలో రూ. 20 లక్షలతో అత్యాధునిక మోడ్రన్ బస్సు షెల్టర్!

Pathapatnam: పాతపట్నంలో రూ.20 లక్షల ఎంపీ నిధులతో మోడ్రన్ బస్ షెల్టర్ నిర్మాణం.. త్వరలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చేతుల మీదుగా శంకుస్థాపన.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 4 Sept 2026 12:35 PM IST
Pathapatnam
X

Pathapatnam: పాతపట్నంలో రూ. 20 లక్షలతో అత్యాధునిక మోడ్రన్ బస్సు షెల్టర్!

Pathapatnam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ప్రయాణికుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. స్థానిక మేజర్ పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న పాత బస్సు షెల్టర్ శిథిలావస్థకు చేరడంతో పాటు తీవ్ర అసౌకర్యాలు, స్థలాభావం కారణంగా నిత్యం రాకపోకలు సాగించే వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దుస్థితిని గమనించిన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సమస్యను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించి తన ఎంపీ నిధుల నుంచి రూ. 20 లక్షల భారీ నిధులను యుద్ధప్రాతిపదికన మంజూరు చేశారు.

దీనితో పాత బస్సు షెల్టర్ ను ఇటీవలే తొలగించి, అదే స్థలంలో ప్రయాణికులకు సకల సౌకర్యాలతో కూడిన అత్యాధునిక మోడ్రన్ బస్సు షెల్టర్ నిర్మాణానికి అధికారులు, నాయకులు సమగ్ర ప్రణాళికతో రంగం సిద్ధం చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక బస్సు షెల్టర్ నిర్మాణ పనులకు అధికారికంగా భూమిపూజ, శంకుస్థాపన నిర్వహించేందుకు స్థానిక కూటమి, టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో గురువారం నాడు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి శంకుస్థాపన జరిగే ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వేదిక నిర్మాణం, శిలాఫలకం ఏర్పాటు, అతిథుల రాక, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. పాతపట్నం కేంద్రంలో నూతన మోడ్రన్ బస్సు షెల్టర్ అందుబాటులోకి వస్తే చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు, మహిళలకు వేసవి ఎండల నుంచి, వర్షాకాలంలో వానల నుంచి పూర్తి రక్షణ లభించడంతో పాటు సురక్షితమైన రవాణా వసతి ఏర్పడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సన్నాహాలు పూర్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పైల బాబ్జి, టీడీపీ పట్టణ అధ్యక్షులు సైలాడ సతీష్, కుమార్, దుర్గారావు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

Next Story