Palakonda: కనీస మద్దతు ధర లేక గిరిపుత్రుల కన్నీరు ప్రభుత్వం పట్టించుకోదా?

Palakonda: సీతంపేట ఏజెన్సీ ప్రాంతాల్లో పైనాపిల్ పండించిన గిరిజన రైతులు కనీస మద్దతు ధర లేక, దళారీల దోపిడీకి గురవుతూ తీవ్ర నష్టాలపాలవుతున్నారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 28 Jun 2026 11:46 AM IST
Palakonda
X

Palakonda: కనీస మద్దతు ధర లేక గిరిపుత్రుల కన్నీరు ప్రభుత్వం పట్టించుకోదా?

పాలకొండ: సీతంపేట ప్రాంతంలో కొండకోనల్లో పండించిన పంటలే వారికి జీవనాధారం.

ప్రతి ఏటా జూన్, జూలై మాసాల్లో గిరిజనులు పైన్ ఆపిల్ పండిస్తూ ఉంటారు.

ఈ సంవత్సరం కనీస మద్దతు ధర లేక గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడి కూడా దక్కకుండా నష్టాలకు పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని గిరిపుత్రులు ఆవేదన చెందుతున్నారు.

రైతు ముఖలింగం మాట్లాడుతూ పండించి అమ్మకానికి తెచ్చిన పంటకు సరైన ధర లేక ఇబ్బంది పడుతునట్టు తెలిపారు.

సరైన ధర లేక 3-10 రూపాయలు వరకు దళారీలు కోనుగోలు చేస్తునట్టు తెలిపారు.

ఇప్పటికైన ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు.

రైతు సుధాకర్ మాట్లాడుతూ కనీసం ధర లేక పండించిన పైనాపిల్ పంటకోతకు కోసం కూలీ పనులు పెట్టిన డబ్బులు కూడా రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

15-18 రూపాయలకు ధర పలికితే గిట్టుబాటు అవుతుందని కానీ 5-10 రూపాయలు అడుగుతుంటే ఎలా గిట్టుబాటు అవుతుందని అన్నారు. ప్రభుత్వం పట్టించుకొని రైతులు గిట్టుబాటు ధర ఇస్తే రైతులకు సంతృప్తిగా ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వలేదని అన్నారు.

వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గారావు మాట్లాడుతూ గిరిజనులు పండించిన పైన్ ఆపిల్ పంట కాయి 8-10 రూపాయలకు కొనుగోలు చేసిన దళారులు 40-50 రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారని అన్నారు.

ఇప్పటికైన ప్రభుత్వం గిరిజనులు పండించిన పంటకు మద్దతు ధర కోసం మార్గదర్శలు రూపొందించాలని డిమాండ్ చేశారు

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story