Srikakulam: పిఎం రాహత్ పథకం పోస్టర్ ఆవిష్కరించిన శ్రీకాకుళం కలెక్టర్

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో పిఎం రాహత్ పథకం పోస్టర్ విడుదల. రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.50 లక్షల వరకు ఉచిత వైద్యం.

Varaprasad, Srikakulam
Published on: 22 April 2026 8:40 AM IST
Srikakulam
X

Srikakulam: పిఎం రాహత్ పథకం పోస్టర్ ఆవిష్కరించిన శ్రీకాకుళం కలెక్టర్

Srikakulam: పిఎం రాహత్ పథకానికి సంబంధించి పోష్టర్ ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆవిష్కరించారు. ఈ పథకం కింద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రులు, ఎన్టీఆర్ వైద్య సేవ, గుర్తింపు పొందిన నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా రూ.1,50,000/-లు విలువ గల వైద్యం ఉచితంగా అందిస్తుందన్నారు.

ప్రమాదం జరిగిన 24 గంటల్లో ఆసుపత్రిలో చేరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పేషెంట్ పరిధిలో గల పోలీస్ స్టేషన్ కు సమాచారం అందుతుందని, అనంతరం వివరాలు సేకరిస్తారన్నారు. ప్రమాదాలు జరిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Varaprasad, Srikakulam

Varaprasad, Srikakulam

Next Story