Srikakulam: పాతపట్నం సరిహద్దుల్లో భారీగా నాటుసారా పట్టివేత!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ సరిహద్దుల్లోని ఒడిశా పర్లాకిమిడి (పార్లఖేముండి)లో పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది భారీ దాడి చేశారు.
Srikakulam: పాతపట్నం సరిహద్దుల్లో భారీగా నాటుసారా పట్టివేత!
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఆనుకొని ఉన్న ఒరిస్సా రాష్ట్రం పర్లాకిముండిలోని 500 లీటర్ల నాటు సారాను పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. నిత్యం పర్లాకిమిడి నుండి పాతపట్నం మీదుగా నాటుసారా అవుతున్న విషయం తెలుసుకున్న అధికారులు పక్కా ప్రణాళికతో ఈ దాడులు చేశారని తెలుస్తోంది.
పర్లాకిముండి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌లో పోలీసులు పోలాకి శాంతమ్మ ఇంట్లో సుమారు 500 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సారాన్ని అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ ఘటనలో, నాటు సారాను అక్రమంగా కలిగి ఉండటం, తయారు చేయడం, అమ్మడం నేరాలకు సంబంధించిన చట్ట నిబంధనల కింద పరలఖేముండి పోలీస్ స్టేషన్‌లో కేసు నెం. 275/2026 నమోదు చేశారు. ఈమె వెనుక ఇంకెవరెవరు ఉన్నారు అన్న అంశాన్ని కూడా దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలుపుతామని పోలీసులు తెలిపారు.




