Srikakulam: వండాలపేటలో రాజకీయ రణం.. వైసీపీ సర్పంచ్ కుటుంబంపై కూటమి దాడులు!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం వండాలపేటలో వైసీపీ సర్పంచ్ కుటుంబంపై కూటమి నేతలు దాడికి పాల్పడ్డారు.

SRIDHAR, RAJAM
Published on: 12 May 2026 12:03 PM IST
Srikakulam
X

Srikakulam: వండాలపేటలో రాజకీయ రణం.. వైసీపీ సర్పంచ్ కుటుంబంపై కూటమి దాడులు!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం పరిధిలోని వండాలపేట గ్రామంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వైసీపీకి చెందిన సర్పంచ్ కుటుంబంపై కూటమి సభ్యులు దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులంతా పెళ్లి కార్యక్రమానికి వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు వైసీపీ సర్పంచ్ పేరును ప్రస్తావిస్తూ దుర్భాషలాడుతున్నారని తెలిపారు. దీనిని గమనించిన సర్పంచ్ అన్నదమ్ములు “ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?” అని ప్రశ్నించగా, “ప్రభుత్వం మాది.. నోరు మూసుకుని భరించండి.. లేకపోతే భౌతిక దాడికి దిగుతాం” అంటూ హెచ్చరించారని ఆరోపించారు.

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగి, అనంతరం స్థానిక టిడిపి నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారని బాధిత కుటుంబం పేర్కొంది. ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన లేకపోగా, తిరిగి తమనే దోషులుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సి ఉందని గ్రామస్థులు కోరుతున్నారు.

SRIDHAR, RAJAM

SRIDHAR, RAJAM

Next Story