Palakonda: నాగవంశం అంగన్వాడీ కేంద్రంలో ఉత్సవం!
Palakonda: పాలకొండ ప్రాజెక్ట్ నాగవంశం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం వేడుకలు, అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.
Palakonda: నాగవంశం అంగన్వాడీ కేంద్రంలో ఉత్సవం!
Palakonda: పాలకొండ ప్రాజెక్టు పాలకొండ సెక్టార్ లో పోషణ మాసం వేడుకలు, అంగన్వాడీ ఉత్సవం నాగవంశం అంగన్వాడీ కేంద్రం లో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు సమక్షం లో ఘనంగా నిర్వహించారు.
ఈసందర్భంగా గర్భిణీ బాలింతలు అంగన్వాడీ కేంద్రం లో ఇచ్చే ఫోర్టిఫైడ్రైస్ , కందిపప్పు, ఆయిల్ ,బాలామ్రతం, బాల సంజీవని కిట్ లబ్ధిదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అంగన్వాడీ కేంద్రం లో ఇచ్చే పోషకాహారం తిని పిల్లలు, మరియు లబ్ధిదారులు వయసుకు తగ్గ బరువు , ఆరోగ్యంతో ఉన్నారని తల్లులు చెప్పడం జరిగింది.
ఈకార్యక్రమంలో సీడీపీఓ పి.రంగలక్ష్మి మాట్లాడుతూ పోషణ మాసం మరియు అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఒక పండుగ వాతావరణం కల్పిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు.
ఈకార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ పి రంగలక్ష్మి సూపర్ వైజర్స్ లావణ్య, దశరత్నం, విస్సమ్మ అంగన్వాడీ కార్యకర్తలు మహిళా పోలీస్, ఆశావర్కర్లు, లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.




