Mandasa: మందస రైతులకు నాణ్యమైన ఎరువుల పంపిణీ - ఎమ్మెల్యే శిరీష
Mandasa: మందసలో ఎరువుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష. అన్నదాత సుఖీభవ, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై రైతుల హర్షం. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం.
Mandasa: మందస రైతులకు నాణ్యమైన ఎరువుల పంపిణీ - ఎమ్మెల్యే శిరీష
మందస: మందస మండలం బాలిగాం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో పలాస శాసన సభ్యులు శ్రీమతి గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు ఎరువులను పంపిణీ చేసి, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు నిరంతరం సాంకేతిక సూచనలు అందించాలని సూచించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అందించే సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
మీ భూమి మీ హక్కులో భాగంగా రాజముద్ర తో కూడిన పట్టాదార్ పాసుబుక్కులు పంపిణీ,అన్నదాత సుఖీభవ పథకం కింద సకాలంలో రైతులు ఖాతాలో డబ్బులు, అలాగే మందస మండలానికి ఈ విడతగా 500 టన్నులు విత్తనాలు రైతులకు అందిస్తున్నందుకు స్థానిక రైతులు ఆనందాన్ని వ్యక్తపరిచారు మరియు గౌరవ శాసనసభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేసారు
ఈ కార్యక్రమంలో amc చైర్మన్ మల్ల శ్రీనివాస్ , గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విఠల్ , మందస మండలం అధ్యక్షులు భావన దుర్యోధన , మందస PACS అధ్యక్షులు లబ్బ రుద్రయ్య , తమరియా భాస్కర్ , ఎంపీడీవో , ఎమ్మార్వో , అగ్రికల్చర్ ఏడి , మందస మండల కూటమి ముఖ్య నాయకులు వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘం సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




