Rajam: రాజాంలో అధ్వాన్నంగా పారిశుధ్యం.. మురుగు నీటిలో గుడి!
Rajam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయతీలో పారిశుధ్య సమస్యలు తీవ్రమయ్యాయి. పాత బస్టాండ్ దుర్గమ్మ ఆలయం వద్ద మోకాళ్ల లోతు మురుగు నీరు చేరింది.
Rajam: రాజాంలో అధ్వాన్నంగా పారిశుధ్యం.. మురుగు నీటిలో గుడి!
రాజాం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయతీ పరిధిలో పారిశుధ్య సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న నవదుర్గ (పాత బస్సు స్టాండ్) ఆలయం ఎదుట మోకాళ్ల లోతు వరకు మురుగు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దుర్గంధం వెదజల్లుతున్న ఈ మురుగు నీటిలో దోమలు విపరీతంగా పెరిగి, డయేరియా, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో రైతులు కూరగాయలు విక్రయిస్తుండటంతో పరిశుభ్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గత పది రోజులుగా సమస్య కొనసాగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మురుగు నీటి తొలగింపు చర్యలు చేపట్టి పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




