Srikakulam: రియల్ ఎస్టేట్ ఘోరం వాయిదాలు కట్టించుకుని బోర్డేసిన వ్యాపారులు
Srikakulam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది.
Srikakulam: రియల్ ఎస్టేట్ ఘోరం వాయిదాలు కట్టించుకుని బోర్డేసిన వ్యాపారులు
శ్రీకాకుళం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతుంది! రాజాం ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అర, కొర స్థలాల పేరుతో అమాయక ప్రజల నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వాయిదాలు పూర్తిగా చెల్లించినప్పటికీ, వాగ్దానం చేసిన స్థలాలు ఇవ్వకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేతులెత్తేశారు.
దీంతో మోసపోయిన బాధితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులు రియల్ ఎస్టేట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అయితే సంబంధిత వ్యాపారులు అందుబాటులో లేకుండా తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. “మా పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన డబ్బు ఇది… ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్లాలి?” అంటూ బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
👉 బాధితుల డిమాండ్:
వెంటనే స్థలాలు కేటాయించాలి లేకపోతే చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈ ఘటనపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.




