Srikakulam: రాజాంలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ భారీ నిరసన ర్యాలీ
Srikakulam: రాజాంలో డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.
Srikakulam: రాజాంలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ భారీ నిరసన ర్యాలీ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గంలో వైసిపి నాయకులు మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ భారీ ర్యాలీ చేపట్టారు దీంతో భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కొంతసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది వైసిపి నాయకులు పొనుగుటి వలస జంక్షన్ లో మానవహారం చేపట్టి తమ నిరసనగాలన్నీ వినిపించారు ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త తలే రాజేష్ మాట్లాడుతూ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందని రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో పడేసిందని అన్నారు డీఎస్సీలో జరిగిన అక్రమాలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వైసిపి డీఎస్సీపై కోరిన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలన్నారు .




