Pathapatnam: తమ్మినేనిపై ఐ-టీడీపీ ట్రోల్స్ దుర్మార్గం!

Pathapatnam: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఐ-టీడీపీ సోషల్ మీడియా ట్రోల్స్‌ను వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రంగా ఖండించారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 10 July 2026 12:43 PM IST
Pathapatnam
X

Pathapatnam: తమ్మినేనిపై ఐ-టీడీపీ ట్రోల్స్ దుర్మార్గం!

Pathapatnam: - తమ్మినేనిపై ఐ-టీడీపీ ట్రోల్స్ దుర్మార్గం

- - బీసీ నేతలపై ఈ కక్షసాధింపు ఎందుకు?

- బలహీన వర్గాల గళంపై పచ్చ ముఠా దాడి..

- రాజకీయ కక్షతోనే మాజీ స్పీకర్‌పై తప్పుడు ప్రచారాలు ...

- బీసీలంటే అంత చులకనా?...

రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిష్కళంకమైన చరిత్ర కలిగిన సీనియర్ నేత, మాజీ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాంపై ఐ-టీడీపీ (iTDP) సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అసత్య ప్రచారాలను, నీచమైన ట్రోల్స్‌ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఖండించారు.

రాజకీయంగా ఎదుర్కోలేక, పచ్చ మీడియాను, ఐ-టీడీపీ సోషల్ మీడియా సైన్యాన్ని వాడుకుంటూ సీనియర్ నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం టీడీపీకి అలవాటుగా మారింది. ఒక గౌరవప్రదమైన పదవిలో పనిచేసిన వ్యక్తిపై ఇలాంటి నీచమైన ట్రోల్స్ చేయడం వారి సంస్కారహీనతకు నిదర్శనం. నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడే తమ్మినేని సీతారాం ప్రతిష్టను దెబ్బతీయాలని టీడీపీ కుట్రలు చేస్తోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించి, స్పీకర్గా తనదైన ముద్ర వేసుకున్న సంస్కారవంతమైన నేతపై టీడీపీ కూటమి సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యక్తిత్వ హననం అత్యంత బాధాకరం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాకే, టీడీపీ నేతలు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందించడం చేతకాక, టీడీపీ కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది.

చంద్రబాబుకి 'రెడ్ బుక్' రాజ్యాంగం అమలు చేయడం తప్ప, మంచి పరిపాలన అందించడం చేతకాదు. ప్రశ్నించే వారిపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడమే ఈ కూటమికి తెలిసిన పాలన. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలన్నీ సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ బీసీ నేతలను లక్ష్యంగా చేసుకోవడం వారి చిన్నచూపుకు నిదర్శనం. రాజధాని వికేంద్రీకరణపై సభాపతిగా ఆయన తన బాధ్యతల్లో భాగంగా మాట్లాడిన మాటలను వక్రీకరించి ఐ-టీడీపీ ట్రోల్స్ చేయడం దురదృష్టకరం.

ఇటువంటి చౌకబారు విమర్శలు, ఫేక్ ప్రచారాల ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా అబద్ధాలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఐ-టీడీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో వీరికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వెంటనే తమ్మినేని సీతారాంపై పెట్టిన అవాస్తవ పోస్టులను తొలగించి, ఐ-టీడీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు టీడీపీ ఇకనైనా స్వస్తి పలకాలని హితవు పలికారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

Next Story