Srikakulam: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరిన వైఎస్సార్‌సీపీ

Srikakulam: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు YSRCP నేత రెడ్డి శాంతి డిమాండ్. దీనిపై రేపు శ్రీకాకుళంలో విద్యార్థి, యువజన విభాగాల భారీ నిరసన ర్యాలీ.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 27 July 2026 1:41 PM IST
Srikakulam
X

Srikakulam: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరిన వైఎస్సార్‌సీపీ

డీఎస్సీ వైఫల్యాలతో విద్యార్థులు, నిరుద్యోగులకు తీరని అన్యాయం

పాతపట్నం రిపోర్టర్ సంతోష్;

- డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిపించాలి.

-

- రూ. 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి...

- నిరుద్యోగులకు నెలకు రూ. 3,000 భృతి చెల్లించాలి.

రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణలో దారుణంగా విఫలమై లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆడుకుంటుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యార్థుల సంక్షేమాన్ని, నిరుద్యోగుల ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా రంగానికి అత్యున్నత ప్రాధాన్యతనిచ్చి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు.

డీఎస్సీ పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు వెలుగుచూసినా ప్రభుత్వం బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని, చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే దీనిపై సీబీఐ (CBI) దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జగనన్న పాలనలో ‘జగనన్న విద్యా దీవెన’ పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నాలుగు విడతల్లో జమ చేసేవారు. దీనివల్ల కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు, విద్యా ప్రమాణాలను నిలదీసే అధికారం తల్లులకు లభించింది. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఒక్క పైసా కూడా భారం పడకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. విడతల వారీగా అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా అందించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టిందని, ప్రస్తుతం రూ. 10,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని కోరారు. నీట్ అక్రమాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగానే రాష్ట్రంలో డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై భారీ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. రేపు (ఈ నెల 28న) శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 7 రోడ్ల కూడలి వద్ద ఉన్న దివంగత మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం నుండి సూర్యమహల్ వరకు వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరగనుందన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగ యువతకు చేస్తున్న దగాకు నిరసనగా జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులతో పాటు ప్రతీ విద్యార్థి, డీఎస్సీ అభ్యర్థి, నిరుద్యోగులు మరియు యువజన సంఘాల నాయకులు స్వచ్ఛందంగా, భారీ ఎత్తున హాజరై నిరసనలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

Next Story