Akkupalli: టాపర్లకు 'బాబూరావు మాస్టర్' ఘన సత్కారం

Akkupalli: అక్కుపల్లి పాఠశాలలో పబ్లిక్ పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన టాపర్లకు రిటైర్డ్ ఆర్జీడీ నగదు పురస్కారాలు, మెమొంటోలు అందించి ఘనంగా సత్కరించారు.

B LOKANADHAM, PALASA
Published on: 1 July 2026 12:22 PM IST
Akkupalli
X

Akkupalli: టాపర్లకు 'బాబూరావు మాస్టర్' ఘన సత్కారం  

Akkupalli: అక్కుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కీర్తి కిరీటంలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. ఈ ఏడాది జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించి, పాఠశాల పేరును ప్రగతి పథంలో నిలిచిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సత్కారం జరిగింది.

విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారిని ఉన్నత చదువుల వైపు మరింత ప్రోత్సహించేందుకు ప్రముఖ విద్యాప్రదాత, రిటైర్డ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ మరియు మాజీ ఆర్.జె.డి (RJD) గౌరవనీయులు మొరిపల్లి బాబురావు మాస్టర్ తనదైన శైలిలో అండగా నిలిచారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఆయన సొంత ఖర్చులతో నగదు పురస్కారాలు, జ్ఞాపికలను (మెమొంటోలను) బహుకరించి ఘనంగా సత్కరించారు.

ఉద్యోగ విరమణ చేసినప్పటికీ, సమాజం పట్ల, విద్యార్థుల భవిష్యత్తు పట్ల బాబురావు మాస్టర్ గారికున్న నిరంతర తపన శ్లాఘనీయమని పలువురు కొనియాడారు. ముఖ్యంగా నిరుపేద విద్యార్థులకు ఆయన అందిస్తున్న ఆర్థిక, మానసిక ప్రోత్సాహం నిజంగా అందరికీ ఆదర్శనీయమని శ్రీ రామా సేవా సంఘం సభ్యులు పేర్కొన్నారు.

విద్యార్థులపై ఉన్న మమకారంతో, వారి ఉన్నత చదువులకు సరికొత్త స్ఫూర్తిని నింపిన మొరిపల్లి బాబురావు సేవాతత్పరతను శ్రీ రామా సేవా సంఘం ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో ఇలాంటి విద్యా దాతలు ఉండటం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో మేలు చేకూరుస్తుందని పేర్కొంటూ, బాబురావు మాస్టర్ కు తమ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలిజేశారు.

B LOKANADHAM, PALASA

B LOKANADHAM, PALASA

Next Story