Saravakota: ఆవలింగి గ్రామంలో కనువిందు చేస్తున్న పాతకాలపు దసరా సంప్రదాయాలు!
Saravakota: ఆవలింగి జేబీటీ పాఠశాలలో చిన్నారులు అలనాటి పాతకాలపు దసరా సంప్రదాయాలను పునరుద్ధరిస్తూ సంప్రదాయ పాటలతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.
Saravakota: ఆవలింగి గ్రామంలో కనువిందు చేస్తున్న పాతకాలపు దసరా సంప్రదాయాలు!
Saravakota: గత వైభవం, అలనాటి సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న తరుణంలో మారుమూల పల్లె గ్రామంలో నేటికీ పాత జ్ఞాపకాలని వెలుగులోనికి తెస్తూ ఎందరో పాతకాలం నాటి మనుషులు అభినందనలు పొందుతున్న గ్రామీణ ప్రాంత విద్యా సంస్థ శ్రీకాకుళం జిల్లా, సారవకోట మండలం, అవలంగి గ్రామంలో స్థాపించిన జేబీటీ విద్యాసంస్థ గత కొన్ని సంవత్సరాలుగా చిన్నారులకు తెలియనటువంటి పిల్లల దసరా ఉత్సవాన్ని చేస్తూ విద్యార్థులు చక్కనైనటువంటి ఉత్తేజాన్నిస్తుంది.
అదేంటంటే పూర్వపు కాలంలో దసరా శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం రోజు నాడు పాఠశాల ప్రాంగణంలో సరస్వతీ పూజ చేసేవారు చేసిన అనంతరం ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు గ్రామంలో ఉండే విద్యార్థులు ఇంటికి అప్పట్లో ఉండే నాయుడు కారణాలు ఇంటికి వెళ్లి "ఏదయ్య మీ దయ మా మీద లేదా ఎండతో వచ్చాము బాలులం మేము ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగునా దసరాకి వస్తుమని విసవిసాలు పడక" అనే పాటలు పాడుకుంటూ వీరు తయారు చేసిన బాణాలలో ఆకులు పువ్వులు వేసి మమ్ములను ఆశీర్వదించమని కోరేవారు.
విద్యార్థులకు అటుకులు,బెల్లం, పెసరపప్పు, ఇచ్చేవారు ఆ రోజులలో బతుకు లేక బడిపంతులు అనేవారు ఉపాధ్యాయులకు వాళ్ళ ఇంటిలో పండే కాయగూరలు, ఆకుకూరలు బియ్యం ఇచ్చేవారు వారికి కొద్దిరోజులు కుటుంబ పోషణకు సహాయపడేవి అనేవారు . కాలక్రమేనా ఉపాధ్యాయులకు జీతభత్యాలు రావడం పాఠశాలల నిర్వాహకులు సంస్కృతి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఈ పండగలు కనుమరుగై దశాబ్దాలు గడిచిపోయాయి.
దానిని వెలికి తీయడానికి గత కొన్ని సంవత్సరాల నుండి ఈ పాఠశాలలో చిన్నారులు మరియు ఉపాధ్యాయ సిబ్బందితో బాణాలు తయారు చేయించి విద్యార్థులు ఆ గ్రామాల మొత్తం తిరిగి వీళ్ళు నేర్చుకున్న పాటలను ప్రదర్శిస్తూ ఇంటి ఇంటికి వెళ్లడం వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న బహుమతులు మిఠాయిలు స్వీకరిస్తూ ఆనందాన్ని పొందుతున్నారు మమ్మల్ని స్ఫూర్తి చేసుకొని మిగతా పాఠశాలలో కూడా చిన్నారులకి ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిస్తే పిల్లలు టీవీకి సెల్ ఫోన్ కి దూరంగా ఉంటారని మా ప్రయత్నం అనే పాఠశాల నిర్వహకులు మోహన్ గాంధీ గారు తెలియజేశారు.




