Srikakulam: బెయిల్‌పై వచ్చి దౌర్జన్యం రౌడీషీటర్‌తో సహా ముగ్గురు అరెస్ట్
Srikakulam: బెయిల్‌పై బయటకొచ్చి మళ్లీ దౌర్జన్యానికి పాల్పడిన రౌడీషీటర్ దేవరాజ్‌తో పాటు మరో ఇద్దరిని రాజాం పోలీసులు అరెస్ట్ చేశారు.
Srikakulam: బెయిల్‌పై వచ్చి దౌర్జన్యం రౌడీషీటర్‌తో సహా ముగ్గురు అరెస్ట్
Srikakulam: బెయిల్‌పై బయటకు వచ్చిన రౌడీషీటర్ మళ్లీ నేర ప్రవృత్తిని కొనసాగించాడని పోలీసులు తెలిపారు. రాజాంలో ఓ వ్యక్తిని అడ్డుకుని డబ్బులు, ద్విచక్ర వాహనం ఇవ్వాలని బెదిరించిన ఘటనలో రౌడీషీటర్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజాం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇప్పటికే 11 కేసులు ఉన్న రౌడీషీటర్ సిరిపురపు దేవరాజ్ అలియాస్ దేవాను గత నెల 27న రాజాం పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చాడు.
అయితే.. మళ్లీ తన నేర ప్రవృత్తిని కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. గోపాలపురం గ్రామానికి చెందిన ఎం. శేఖర్‌బాబు ఈ నెల 26న రాత్రి రాజాంలో పనులు ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో దేవరాజ్‌తో పాటు పెనుబాక గ్రామానికి చెందిన బోనెల దుర్గాప్రసాద్, బోనెల దిలీప్‌కుమార్ అతడిని అడ్డుకున్నారు.
డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తన వద్ద డబ్బులు లేవని శేఖర్‌బాబు చెప్పినా వినలేదని పోలీసులు తెలిపారు. డబ్బులు, ద్విచక్ర వాహనం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతరం శేఖర్‌బాబు జేబులో ఉన్న వెయ్యి రూపాయలను బలవంతంగా తీసుకోవడంతో పాటు ద్విచక్ర వాహనాన్ని కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు.
ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో భయపడిన శేఖర్‌బాబు వెంటనే పోలీసులను ఆశ్రయించలేదు. అనంతరం గ్రామస్థుల సహకారంతో రాజాం టౌన్ సీఐ డి. నవీన్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు ఎస్ఐ సల్మాన్ బేగ్ కేసు నమోదు చేసి దేవరాజ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముగ్గురినీ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు.
బైట్ – సీఐ నవీన్‌కుమార్:
ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా.. నగదు లేదా వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేసినా భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలు, వ్యాపారస్తులకు సీఐ నవీన్‌కుమార్ సూచించారు.
స్లగ్:
బెయిల్‌పై వచ్చి.. బెంబేలెత్తించి..
టాప్ బ్యాండ్:
రౌడీషీటర్‌తో పాటు మరో ఇద్దరి అరెస్ట్
బ్రేకింగ్ టిక్కర్లు:
- రాజాంలో రౌడీషీటర్‌తో పాటు మరో ఇద్దరి అరెస్ట్
- బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ నేరానికి పాల్పడినట్లు ఆరోపణ
- వ్యక్తిని అడ్డుకుని డబ్బులు, బైక్ ఇవ్వాలని బెదిరింపు
- వెయ్యి రూపాయలు, ద్విచక్ర వాహనం లాక్కెళ్లినట్లు ఫిర్యాదు
- ముగ్గురినీ రిమాండ్‌కు తరలించిన పోలీసులు
- బెదిరింపులకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ సూచన




