Kanchili: కంచిలి మండలంలో రూ. 1.70 కోట్లతో తాగునీరు, సీసీ రోడ్డు పనుల ప్రారంభం!

Kanchili: కంచిలి మండలంలో రూ.1.70 కోట్లతో ఇంటింటికీ తాగునీటి జలజీవన్ మిషన్, సీసీ రోడ్ల పనులకు శ్రీకారం చుట్టిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు.

G.RAMBABU, SOMPET
Published on: 13 Oct 2026 6:34 PM IST
Kanchili
X

Kanchili: కంచిలి మండలంలో రూ. 1.70 కోట్లతో తాగునీరు, సీసీ రోడ్డు పనుల ప్రారంభం!

కంచిలి: కంచిలి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ కంచిలి మండలంలోని కొల్లూరు, ఎం.ఎస్‌.పల్లి, పురుషోత్తపురం పంచాయతీల పరిధిలో అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్ బాబు, జనసేన ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి దాసరి రాజు పనులను ప్రారంభించారు.

మూడు పంచాయతీల పరిధిలో సుమారు రూ.1.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రహదారుల పనులతో పాటు, ఇంటింటికీ తాగునీరు అందించే జలజీవన్ మిషన్ పథకానికి సంబంధించిన పనులను ప్రారంభించారు. అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కొల్లూరు పంచాయతీలో ఇంటింటి నుంచి చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్‌ను ప్రారంభించారు. గ్రామాల్లో రహదారుల సౌకర్యం మెరుగుపడటంతో పాటు, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు ఈ పనులు దోహదపడనున్నాయి.

కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కంచిలి మండల అధ్యక్షులు మాదిన రామారావు, ఐటీడీపీ మండల అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు ఈశ్వర్ రావు, పీఏసీఎస్ అధ్యక్షుడు పురుషోత్తం, పీఏసీఎస్ సభ్యులు కిషోర్, శ్రీకాంత్, వంశీ, శ్రీరాములు, కురయ్య, హరి, జగదీష్ పట్నాయక్, పిలక చిన్నబాబు, సూర్యనారాయణ, రామారావు, భాస్కర్ రెడ్డి, మన్మధరావు, శ్రీరాములు అప్పారావు, ప్రదీప్ తదితర నాయకులు, వివిధ పంచాయతీల మాజీ సర్పంచులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET