Srikakulam: అరసవిల్లి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్ల నిధులు మంజూరు!
Srikakulam: శ్రీకాకుళంలోని ప్రసిద్ధ అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి స్వదేశ్ దర్శన్ 2.0 కింద రూ.55.74 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు.
Srikakulam: అరసవిల్లి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్ల నిధులు మంజూరు!
Srikakulam: ఆరోగ్య ప్రదాత అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్ల నిధులు మంజూరయ్యాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు. నేడు అరసవిల్లి సూర్యనారాయణ స్వామి కిరణ స్పర్శ చూడడానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అరసవిల్లికి మార్దశ వచ్చిందని స్వదేశ్ దర్శన్ 2.0 కింద ఈ నిధులు విడుదలయినట్టు అన్నారు.
అరసవల్లిని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్థి చేయడంతో పాటు శ్రీకాకుళం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇది ఒక కీలక ముందడుగని పేర్కొన్నారు. అరసవల్లి ఆలయం మరింత అభివృద్ధి చెందేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.
ప్రధాన ఉత్సవమైన రథసప్తమి వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని, లక్షలాది మంది భక్తులు అరసవల్లిని సందర్శిస్తున్నారని తెలిపారు. స్వదేశ్ దర్శన్ కింద నిధులు కేటాయించినందుకు గాను , ఈ నిధులు కోసం కృషి చేసిన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.




