Seethampeta: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు
Seethampeta: సీతంపేట శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి; విద్యార్థులకు పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు.
Seethampeta: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు
సీతంపేట: శాఖా గ్రంథాలయం సీతంపేట, 59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు ముగింపు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.సీతంపేట మండల విద్యాశాఖాధికారి ముడిదాన ఆనందరావు మాట్లాడుతూ పిల్లలు పంచతంత్రం ,భగవద్గీత, వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు లైబ్రరీలో పుస్తకాలు చదవాలి.
అని పెద్ద బాలశిక్ష రామాయణం .స్టోరీ కాకుండా ఫిక్షన్ మరియు నాన్ఫెక్షన్ కథలు చదవాలని అవి చదివితే విజ్ఞానం పెరుగుతుంది అని అలా మనకు పుస్తకాలు చదవడం అలవాటుగా మారుతుందని రచయితలు విషయాన్ని వాళ్ళు పుస్తకాల్లో వారి జీవితాల్లో జరిగిన కొన్ని మంచి విషయాలు చెబుతారు అందులో కొన్ని తప్పులు విడిచి పెట్టి వారితో పాటు మన జీవించినట్లే ఆ తప్పులు మనం చేయకుండా మనకు ఏమి అయితే సపోర్ట్ చేస్తావో అవి మనం గ్రహించుకోవాలి.
ఇవే కాకుండా ఒక ప్రదేశం కోసం రాసిన పుస్తకం చదివి మంచి విషయం గ్రహించుకోవచ్చు అని ఓ పుస్తకం చదివిన తర్వాత దాని నుంచి మనం ఏమి నేర్చుకున్నాము అతి ముఖ్యం అని, ప్రధానమంత్రి రాష్ట్రపతులు పెద్దపెద్ద వాళ్లు మనకు తరగతి పుస్తకాలే కాకుండా మిగతా పుస్తకాలు చదవమని చెప్పారు.MEO 2 డి.సూర్యారావు మాట్లాడుతూ గ్రంథాలయంల యొక్క అవశ్యకత చిరిగిన చొక్కాఐనా వేసుకో గాని మంచి పుస్తకం కొనుక్కో అని ఇప్పుడు మీకు ఆ అవసరం లేదు ఎందుకంటే మీ స్కూల్ లకు గ్రంథాలయం వాటికి పుస్తకాలు ఇవ్వడం జరిగింది.
ఎవరైతే పుస్తకాలతో ఫ్రెండ్ షిప్ చేస్తారో వారికే భవిష్యత్తు అని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి రామక్రిష్ణ మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాల యొక్క అవశ్యకత గురించి చెప్పారు గతంలో ఏదైనా తెలియాలి అన్నా చదవాలి అన్నా గ్రంథాలయం నకు వెళ్లవలసిందే ఇప్పుడు అంత మొబైల్ అన్ని మన దగ్గరకే వస్తున్నాయి .దీనివలన కొందరు బాగుపడిన వారు తక్కువ అని మొబైల్ ఫోన్ దానిని ఎలా ఉపయోగించుకుంటారో వారే ప్రయోజకులు అవుతారు అందుకే ఈ గ్రంథాలయ వారోత్సవాల వలన పిల్లలకు మళ్ళీ వాటి యొక్క ప్రాముఖ్యత కోసం మళ్ళీ పాత రోజుల్లో పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని చెప్పారు.పదో తరగతి పిల్లలకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
అటు తర్వాత విజేతలకు బహుమతి ప్రధానం వ్యాస రచన పోటీలో మొదటి బహుమతి బి. తపస్వి,9వ తరగతి, KGBV స్కూల్, రెండవ బహుమతి , S.శ్రీజ 9వ తరగతి, గవర్నమెంట్ హై స్కూల్, మూడవ బహుమతి కి.. లాస్య, 9 వ తరగతి,KGBV, డ్రాయింగ్ పోటీలు S. సన్నీ గ్రేస్ 9 వ తరగతి గవర్నమెంట్ హై స్కూల్, రెండవ బహుమతి S. శ్రావ్య 9వ తరగతి, KGBV స్కూల్, మూడవ బహుమతి , జోష్నవి 9వ తరగతి గవర్నమెంట్ హై స్కూల్. బహుమతి ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలోగవర్నమెంట్ హై స్కూల్ మరియు కేజిబివి స్కూల్,పాఠశాల పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్అసిస్టెంట్లు ,అభిమన్యు ,N. వెంకట రత్నం, నిమ్మక శ్రీనివాసరావు CRMT మరియు స్కూల్ పిల్లలు మరియు స్థానిక గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్ బాబు సహాయకుడు రామకృష్ణ పాల్గొన్నారు..




