Seethampeta: జీవో నంబర్ 3 పునరుద్ధరించాలి సీతంపేటలో ఆదివాసీల కదం తొక్కడం!

Seethampeta: సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజనుల భారీ నిరసన ర్యాలీ. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కళావతి, న్యాయవాది జడ శ్రవణ్. ఆగస్టు 14న విజయవాడలో భారీ సభ.

KAILASH SAHU, PALAKONDA
Published on: 3 Aug 2026 8:24 PM IST
Seethampeta
X

Seethampeta: జీవో నంబర్ 3 పునరుద్ధరించాలి సీతంపేటలో ఆదివాసీల కదం తొక్కడం!

సీతంపేట: ఆదివాసీల విషయంలో గత, ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్. 2020 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనుల పక్షంలో జరిగిన న్యాయ విచారణలో కచ్చితమైన వాదన వినిపించడంలో విఫలమయిందని ఆయన దూయబట్టారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 3 ని పునరుద్దరిస్తామని ఎన్నికల వాగ్దానంలో పేర్కొన్నారని దాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన అన్నారు ఆగష్టు 14 న విజయవాడ వేదికగా భారీ సభ నిర్వహించనున్నామని తెలిపారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట వేదికగా ఆదివాసీ సంఘాలు కధం తొక్కాయి. ఉమ్మడి శ్రీకాకుళం ఉమ్మడి విజయనగరం జిల్లాల ఆదివాసీలు సీతంపేట ఐటీడీఏ పరిధిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ర్యాలీలో మాజీ న్యాయవాది జడ శ్రవణ్ ప్రత్యేక అతిధిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆదివాసుల రక్షణకై ప్రభుత్వం తమ విధివిధానాలు రూపొందించాలని కోరిన ఆదివాసీ నిరసన ర్యాలీలో పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, న్యాయవాది జడ శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ శ్రవణ్ మాట్లాడుతూ ఆదివాసీల రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమలు చెయ్యాలని, జీవో నెంబర్ 3 పునరుద్దరణ జరిగినప్పుడే గిరిజనులకు సమగ్ర న్యాయం జరుగుతుందని అన్నారు.

ప్రభుత్వ తప్పిద్దాల వల్ల గిరిజనులు తమ భూములపై హక్కులు కోల్పోతున్నారని రాజ్యాంగం ప్రకారం తమకు కల్పించబడిన హక్కులను తిరిగి కల్పించబడేలా ప్రభుత్వాలు అండగా నిలవాలని దానికోసం ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 14 న విజయవాడ వేదికగా భారీ బహిరంగ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story