Sompeta: సీతయ్య ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి చార్లెట్ ఎన్‌ఆర్‌ఐల విరాళం
Sompeta: శ్రీకాకుళం జిల్లా సోంపేట సీతయ్య ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి చార్లెట్ ప్రవాసాంధ్రుల రూ.1.10 లక్షల ఆర్థిక సాయం. నిర్వాహకుల కృతజ్ఞతలు.
Sompeta: సీతయ్య ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి చార్లెట్ ఎన్‌ఆర్‌ఐల విరాళం
సోంపేట: వృద్ధులు, పక్షవాత బాధితుల సంక్షేమమే లక్ష్యంగా సేవలందిస్తున్న సీతయ్య ఫౌండేషన్‌కు అమెరికాలోని చార్లెట్ నగర ప్రవాసాంధ్రులు మరోసారి ఆర్థిక చేయూత అందించారు. ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవలను గుర్తించి రూ.1,10,000 (ఒక లక్ష పది వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.
పలాస పట్టణానికి చెందిన అందవరపు నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు చార్లెట్‌లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు ఈ విరాళాన్ని సమర్పించారు. వృద్ధాశ్రమంలో దిక్కులేని వృద్ధులు, పక్షవాత బాధితులకు అందిస్తున్న సేవల్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో దాతలు ముందుకొచ్చారు.
ఈ విరాళానికి సహకరించిన రాము–స్వరూపరాణి దంపతులు, నరేంద్ర–సునీత దంపతులు, గుడ్ల రవి–సుచిరిత దంపతులు, కొప్పురవూరి వెంకట్–మంజు దంపతులు, ఆకుల తారానాధ్, పి.ఎస్. రాఘవేంద్ర, పి.ఎస్. కుమారస్వామిలకు సీతయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుళ్ల రమేష్, గుళ్ల మోహనరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సేవా కార్యక్రమాలకు నిరంతరం సహకరిస్తూ మానవత్వాన్ని చాటుతున్న ప్రవాసాంధ్రుల దాతృత్వం అభినందనీయమని ఫౌండేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు.




