Kanchili: పెద్ద కొజ్జిరియా సర్పంచ్ బరిలో పొందల సుధారాణి నామినేషన్!

Kanchili: శ్రీకాకుళం జిల్లా సోంపేట నియోజకవర్గం కంచిలి మండలంలోని పెద్ద కొజ్జిరియా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పొందల సుధారాణి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 15 Nov 2026 3:47 PM IST
Kanchili
X

Kanchili: పెద్ద కొజ్జిరియా సర్పంచ్ బరిలో పొందల సుధారాణి నామినేషన్!

కంచిలి: కంచిలి మండలంలోని పెద్ద కొజ్జిరియా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పొందల సుధారాణి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. గ్రామ మాజీ సర్పంచ్ పొందల ఢిల్లీ రావు సతీమణి అయిన సుధారాణి ఎన్నికల బరిలో నిలవడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. నామినేషన్ దాఖలు సమయంలో పొందల ఢిల్లీ రావు, కుమారుడు పొందల జయకృష్ణ, ప్రధాన లజపతిరావు తో పాటు కార్యకర్తలు, అభిమానులు ఆమెకు మద్దతుగా ఉన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET