Sompeta: నిరుపేద వితంతు మహిళకు కుట్టు మిషన్ అందజేత

Sompeta: సోంపేటలో నిరుపేద వితంతు మహిళ సింహాచలం నారాయణమ్మ దీనస్థితిని తెలుసుకున్న 'మేమున్నాం' స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఆమెకు కుట్టు మిషన్‌ను అందజేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 31 Aug 2026 9:13 PM IST
Sompeta
X

Sompeta: నిరుపేద వితంతు మహిళకు కుట్టు మిషన్ అందజేత

సోంపేట: సోంపేట పట్టణంలోని సీతారాంపేటకు చెందిన నిరుపేద వైష్ణవ కుటుంబానికి చెందిన వితంతు మహిళ సింహాచలం నారాయణమ్మకు మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ చేయూతనందించింది. నారాయణమ్మ ఇద్దరు కుమార్తెలతో కలిసి చెరువు గట్టుపై చిన్న షెడ్డు వేసుకుని దుర్భర జీవితం గడుపుతోంది.

కనీసం సొంత ఇల్లు లేదు. సామాజిక పింఛను పథకం సైతం అందడం లేదు. ఆమె దీనస్థితిని తెలుసుకున్న 1987-88 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి రూ.7000 విలువ చేసే కుట్టు మిషన్ ను అందజేశారు.

భవిష్యత్తులో ఆ కుటుంబానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు తడక మాధవరావు, కార్యదర్శి నాగరాజు, వాసుదేవ పాణిగ్రహి, మడ్డు తిరుపతిరావు, సురేష్, సతీష్, మనోజ్, పాపారావు, వెంకటరమణ, దేవా, లక్ష్మణరావు, జానకిరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story